ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దేశాల దాడులు జరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర వాసులు దుబాయ్‌లో చిక్కుకుపోయారు. అయితే వారిని స్వదేశానికి తరలించేందుకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర పడ్నవీస్ రెండు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేశారు. ఈ చర్య ద్వారా అక్కడ ఇబ్బందుల్లో ఉన్న అనేక మంది మహారాష్ట్ర వాసులకు ఊరట లభించింది.