
సౌత్ఆఫ్రికా ఆలౌట్.. భారత్ టార్గెట్ 124
భారత్తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా 153 పరుగులకు ఆలౌట్ అయింది. 123 పరుగుల లీడ్లో ఉంది. భారత్కు 124 రన్స్ లక్ష్యాన్ని నిర్దేశించింది. బవుమా (55*), కోర్బిన్ 25 పరుగులు చేశారు. భారత బౌలర్లలో జడేజా 4 వికెట్లతో చెలరేగారు. కుల్దీప్, సిరాజ్ తల 2 వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్, బుమ్రా చెరో వికెట్ తీశారు. కాగా తొలి ఇన్నింగ్స్లో సౌత్ఆఫ్రికా 159, భారత్ 189 పరుగులు చేసింది.




