
ibomma నిర్వాహకుడు రవి అరెస్ట్.. వెలుగులోకి కీలక విషయాలు
ఐబొమ్మ నిర్వాహకుడు రవిని శనివారం పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రవి బెట్టింగ్, ఆన్లైన్ గేమింగ్‌ను ప్రమోట్ చేసినట్లు గుర్తించారు. ఐబొమ్మ సైట్లో 1XBet, ఇతర యాప్స్ ప్రకటనలు ఇవ్వడంతో సినిమాలు చూసేవారిని బెట్టింగ్ వైపు మళ్లించే ప్లాన్ చేసినట్లు సమాచారం. బెట్టింగ్ కంపెనీల నుంచి రవి కోట్లలో డబ్బు తీసకున్నట్లు తెలుస్తోంది. కాగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లింక్‌ల ద్వారానే పోలీసులు రవిని ట్రేస్ చేశారు.




