
నైట్ షిఫ్ట్లతో విసుగు పుట్టి.. 10 మందిని చంపేసిన నర్సు
జర్మనీలో నైట్ షిఫ్ట్‌ల ఒత్తిడిని తట్టుకోలేక ఓ మేల్ నర్సు 10 మందిని హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. వుయెర్సెలెన్ ఆసుపత్రిలో పనిచేస్తున్న అతడు రోగులకు హైడోస్ ఇంజెక్షన్లు ఇచ్చి చంపినట్లు విచారణలో బయటపడింది. పని ఒత్తిడి నుంచి బయటపడేందుకు ఈ ఘోరానికి పాల్పడ్డానని అతడు కోర్టులో ఒప్పుకున్నాడు. దీనిపై కోర్టు అతనికి జీవిత ఖైదు శిక్ష విధించింది. అలాగే మరో 27 మందిపై హత్యాయత్నం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది.




