
బెంగళూరులో ఎబోలా లక్షణాలు.. ఆందోళనలో కర్ణాటక
కర్ణాటక రాజధాని బెంగళూరులో ఉగాండాకు చెందిన 28 ఏళ్ల మహిళలో ఎబోలా లక్షణాలు కనిపించాయి. ఈ నెల 23న అహ్మదాబాద్ మీదుగా బెంగళూరు చేరుకున్న ఆమెలో ఒళ్లునొప్పులు, అలసట వంటి లక్షణాలను ఎయిర్పోర్టు వైద్య సిబ్బంది గుర్తించారు. ముందుజాగ్రత్తగా ఆమెను ఐసోలేట్ చేశారు. రక్త నమూనాలను పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించారు. రిపోర్టు రావాల్సి ఉంది. ఎబోలా లక్షణాలు కనిపించడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.




