
సినిమా కోసం కిడ్నీ అమ్మడానికైనా సిద్ధం: రేఖా భోజ్
కాంట్రవర్సీ బ్యూటీ రేఖా భోజ్ ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో నటించడానికి ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నానని, గతంలో 'సామి సామి' కవర్ సాంగ్ కోసం బంగారు గాజులు అమ్ముకున్నానని తెలిపారు. ప్రస్తుతం అవకాశాలు తక్కువగా ఉన్నా నటనను విడిచిపెట్టే ప్రసక్తే లేదని, అవసరమైతే కిడ్నీ అమ్ముకుని సొంతంగా సినిమా చేస్తానని అన్నారు. గత మూడేళ్లుగా కమిట్ మెంట్ ఆఫర్లు వస్తున్నా, వాటిని తిరస్కరిస్తూ సొంత ట్యాలెంట్తోనే సంపాదించుకోవాలని నిర్ణయించుకున్నట్లు రేఖ తెలిపారు.




