
త్వరలో మైదానంలోకి రిషబ్ పంత్
భారత వికెట్ కీపర్ - బ్యాటర్ రిషబ్ పంత్ త్వరలో క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ నెల చివరిలో జరగనున్న రంజీ ట్రోఫీ 2025/26 ద్వారా ఢిల్లీ జట్టు తరఫున రీఎంట్రీ ఇవ్వనున్నాడు. దీనికి ముందు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి మెడికల్ క్లియరెన్స్ పొందడం తప్పనిసరి. ఇక్కడ వైద్య బృందం పూర్తిగా ఫిట్‌గా ఉన్నట్లు ప్రకటిస్తే అక్టోబర్ 25 నుంచి ఢిల్లీలో జరిగే రెండు రంజీ ట్రోఫీ మ్యాచ్‌లకు అతను అందుబాటులో ఉండవచ్చు.




