TG: నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతల మధ్య సమన్వయం, క్రమశిక్షణారాహిత్యంపై TPCC చీఫ్ మహేశ్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమశిక్షణారాహిత్యం వల్ల జరుగుతున్న పరిణామాలపై దృష్టి పెట్టిన ఆయన.. మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే లక్ష్మికాంతారావుతో మాట్లాడనున్నారు. గురువారం గాంధీభవన్ రావాలని వీరికి సూచించారు. వీరితో చర్చించాక మిగతా నియోజకవర్గాల్లోని పరిస్థితులపై దృష్టి పెట్టనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.