సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న యాక్షన్ అడ్వెంచర్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో మహేష్ సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. ఈ సినిమాలో అదిరిపోయే ఫోక్ సాంగ్ ప్లాన్ చేశారు. ఈ పాటలో మహేష్ బాబుతో పాటు బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా కూడా స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. నవంబర్‌లో సినిమా నుంచి మరిన్ని అప్‌డేట్స్ రానున్నాయి.