SSMB 29 సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే నవంబర్ 11 లేదా 15న హైదరాబాద్‌లో రాజమౌళి ఒక గ్రాండ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది. ఈ ఈవెంట్‌లో సినిమా టైటిల్, గ్లింప్స్ వీడియో విడుదల చేయడంతో పాటు, రాజమౌళి స్టోరీ లైన్‌ను కూడా రివీల్ చేస్తారని సమాచారం. అలాగే 'అవతార్', 'టైటానిక్' దర్శకుడు జేమ్స్ కెమెరూన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని వార్తలు వస్తున్నాయి. 'వారణాసి' అనే టైటిల్‌ను ఖరారు చెయ్యొచ్చని సమాచారం.