
ఈనెల 15న ఆసీస్ కు టీమ్ఇండియా ప్రయాణం
భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు ఈనెల 15న బయల్దేరనుంది. ఆసీస్‌తో మూడు వన్డేల సిరీస్ 19వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. బిజినెస్ క్లాస్ టికెట్ల లభ్యతను బట్టి ఆటగాళ్లు ప్రయాణించనున్నారు. రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్, కోహ్లీ వంటి ఆటగాళ్లు పెర్త్‌కు వెళ్లనున్నారు. 2027 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని, సెలెక్టర్లు రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి శుభ్‌మన్ గిల్‌కు బాధ్యతలు అప్పగించారు. ఐదు మ్యాచ్‌ల టీ20 కూడా సిరీస్ జరగనుంది.




