బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. బాగలూరు ప్రాంతంలో ఒక ఇంట్లో పనిచేసే పనిమనిషి పుష్పలత లిఫ్ట్‌లో పెంపుడు కుక్కను నేలకేసి బాది చంపింది. సీసీటీవీ ఫుటేజ్‌లో ఈ ఘటన రికార్డైంది. కుక్క యజమాని ఫిర్యాదు మేరకు జంతు హింస కేసు నమోదు చేసి, పోలీసులు పుష్పలతను అరెస్ట్ చేశారు. ఆమె కుక్కను ఎందుకు చంపిందనే దానిపై దర్యాప్తు జరుగుతోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.