కేరళలోని దట్టమైన అడవుల్లో నేషనల్ క్రష్ రష్మిక నటిస్తున్న ‘మైసా’ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. దర్శకుడు రవీంద్ర పుల్లె తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఆమె గోండు గిరిజన యువతిగా పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న యాక్షన్ షెడ్యూల్‌లో ప్రముఖ స్టంట్ మాస్టర్ కెచా నేతృత్వంలో 15–16 రోజుల పాటు భారీ పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. రష్మిక డూప్ లేకుండా స్వయంగా యాక్షన్ సీన్స్‌లో పాల్గొనడం విశేషం. ఈ పాత్ర కోసం ఆమె బ్యాంకాక్‌లో ఇంటర్నేషనల్ యాక్షన్ ట్రైనర్ ఆండి లాంగ్ వద్ద కఠిన శిక్షణ తీసుకుంది.