బంగ్లాదేశ్ వైమానిక దళంలో ఏప్రిల్ 20 నుంచి అంతర్గత భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో భారీ ప్రక్షాళన ప్రారంభమైంది. స్క్వాడ్రన్ లీడర్ స్థాయి నుంచి ఎయిర్ క్రాఫ్ట్‌మెన్ వరకు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ ప్రభావం పెరగడం, భారత సరిహద్దుల్లోని రాడార్ కేంద్రాల నుంచి సమాచారం పాకిస్థాన్‌కు చేరవేస్తున్నారనే ఆరోపణలు ఈ చర్యకు దారితీశాయి. ఏప్రిల్ 2026లో బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి భారత పర్యటనలో సరిహద్దు భద్రతపై
భారత్ ఆందోళన వ్యక్తం చేయగా, బంగ్లాదేశ్ ప్రభుత్వం చొరబాట్లను అరికట్టేందుకు హామీ ఇచ్చింది.