శ్రీశైలంలో జనవరి 12వ తేదీ నుంచి ఏడు రోజుల పాటు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 18వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారి యాగశాల ప్రవేశం, లోకాయుక్త కల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు బ్రహ్మోత్సవ సంకల్పాన్ని పఠిస్తారు. జనవరి 13 నుంచి భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామివార్లకు వాహన సేవలు ప్రారంభమవుతాయి. 15న స్వామి అమ్మవార్లకు బ్రహ్మోత్సవ కల్యాణం జరగనుంది.