మకరజ్యోతి దర్శనం కోసం శబరిమలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కేరళ పోలీసులు పలు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. జనవరి 12 నుంచి పంబాలో వాహనాల పార్కింగ్‌ను నిషేధించారు. జనవరి 14న ఉదయం 9 గంటల తర్వాత నీలక్కల్ నుంచి పంబాకు, అదే రోజు ఉదయం 10 గంటల నుంచి పంబా-సన్నిధానం వరకు ఎలాంటి వాహనాలను అనుమతించబోమని స్పష్టం చేశారు. అయ్యప్ప భక్తులు ఈ విషయాన్ని గమనించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.