TG: కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. జీతం తీసుకుంటూ ఇంట్లోనే కూర్చుంటే ఎలాగని ప్రశ్నిస్తూ, సిగ్గుంటే ఆయనతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. మంత్రి పొంగులేటిపై ఆరోపణలను కొట్టిపారేస్తూ, ఆధారాలుంటే సీబీసీఐడీకి ఇవ్వాలని సవాల్ విసిరారు. 'గురివింద గింజ తన కింద నలుపు ఎరుగదన్నట్లు'గా విపక్షాల తీరు ఉందని ఎద్దేవా చేశారు. పేదల కోసం పనిచేసే తమ ప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యాస్పదమన్నారు.