TG: మక్తల్ నియోజకవర్గాన్ని గత పాలకులు నిర్లక్ష్యం చేశారని, అందుకే మక్తల్ నుంచి ప్రజాపాలన విజయోత్సవాలు ప్రారంభించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం మక్తల్ బహిరంగ సభలో మాట్లాడుతూ.. 'పాలమూరు గడ్డ ప్రేమిస్తే ప్రాణమిస్తుంది. మోసగిస్తే పాతాళానికి తొక్కుతుంది.. గత పాలకులు ఈ ప్రాంతాలకు నీళ్లు ఇవ్వాలన్న ఆలోచన చేయలేదు. ఈ జిల్లా ప్రాజెక్టులను గత ప్రభుత్వాధినేత పూర్తి చేయలేదు. సాగునీరు, తాగునీరు కోసం ఏనాడు గత పాలకులు తాపత్రయపడలేదు' అని అన్నారు.