
రన్నింగ్ ట్రైన్లోంచి దూకిన వ్యక్తి.. షాకింగ్ వీడియో
రన్నింగ్ ట్రైన్ లోంచి దూకిన ఓ వ్యక్తి గాయాలపాలయ్యాడు. ట్రైన్ చాలా స్పీడ్లో ఉండగానే ఓ వ్యక్తి ట్రైన్ నుంచి దూకేశాడు. రైలు, ప్లాట్ఫాం మధ్యలో పడిపోయే క్రమంలో అక్కడే ఉన్న రైల్వే కానిస్టేబుల్ వెంటనే పక్కకు లాగాడు. దీంతో సదరు వ్యక్తికి గాయాలు కాగా.. ప్రాణాలతో బయటపడ్డాడు. ఇది ఎక్కడ జరిగింది అనేది స్పష్టత లేదు. కాగా ట్రైన్ ఆగిన తర్వాత దిగాలని, ఇలాంటి పిచ్చి పనులు మానుకోవాలని నెటిజన్లు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో SMలో వైరల్ అవుతోంది.




