మలయాళ నటుడు, 'సాహో' ఫేమ్ దేవన్ తన భార్య ఐస్ క్రీమ్ తినడం వల్ల మరణించినట్లు తెలిపారు. వైద్యులు అలర్జీ కారణంగా ఐస్ క్రీమ్‌కు దూరంగా ఉండాలని సూచించినప్పటికీ, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె తన కూతురు దాచుకున్న ఐస్ క్రీమ్‌ను తినేసింది. ఆ తర్వాత తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.