
గుజరాత్లో బాంబు బెదిరింపులు.. అసెంబ్లీ, కోర్టు, స్కూళ్లకు కలకలం
గుజరాత్ అసెంబ్లీ, గాంధీనగర్ కోర్టు, అహ్మదాబాద్‌లోని మూడు పాఠశాలలకు గురువారం బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆయా ప్రాంగణాలను ఖాళీ చేయించి, బాంబ్ స్క్వాడ్లతో సోదాలు నిర్వహించారు. బెదిరింపు ఈమెయిల్స్ విదేశాల నుంచి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనతో రాష్ట్రవ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసులు ఈమెయిల్స్ మూలాలపై దర్యాప్తు చేస్తున్నారు.




