కౌలాలంపూర్ నుంచి జెడ్డాకు సోమవారం బయలుదేరిన మలేషియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన
విమానం ఇంజిన్ నంబర్-2లో సాంకేతిక లోపం తలెత్తడంతో 186 మంది ప్రయాణికులతో చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి అత్యవసరంగా మళ్లించారు. అధికారులు 'ఫుల్ ఎమర్జెన్సీ' ప్రకటించి,
విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా, తిరుచిరాపల్లి నుంచి సింగపూర్ వెళ్తున్న ఎయిర్
ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో కూడా లోపం రావడంతో చెన్నైకే మళ్లించారు. రెండు విమానాలు సురక్షితంగా ల్యాండ్ అవ్వడంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.