మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ ఎలియాస్ అభయ్ ఉద్యమాన్ని వీడుతున్నట్లు ప్రకటించారు. బుధవారం ఆయనను గడ్చిరోలి పోలీసులు మీడియా ఎదుట ప్రవేశపెట్టగా.. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ ఎదుట లొంగిపోయారు. . మావోయిస్టు పార్టీ వైఖరి సరిగా లేదంటూ ఇటీవల ఆయన పలుమార్లు లేఖలు రాసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం 60 మంది ఉద్యమ సహచరులతో కలిసి మహారాష్ట్ర పోలీసుల ఎదుట లొంగిపోయారు.