పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేళ
రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. తాజాగా సీఎం మమతా బెనర్జీ స్వయంగా కూరగాయలు కొనుగోలు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. కొద్దిరోజుల క్రితం ప్రధాని
మోదీ పల్లీలు కొనుగోలు చేసిన దృశ్యాలు వైరల్ కాగా, ఇప్పుడు మమతా బెనర్జీ కూడా అదే రీతిలో ప్రజల వద్దకు వెళ్లడం చర్చనీయాంశమైంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు అగ్ర నాయకులు ఇలాంటి వినూత్న పద్ధతులను ఎంచుకుంటూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.