కేంద్ర బలగాలపై మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు

6363చూసినవారు
కేంద్ర బలగాలపై మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు
పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతున్న పోలింగ్ నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ కేంద్ర బలగాలపై సంచలన ఆరోపణలు చేశారు. కేంద్ర బలగాలు బీజేపీ తరఫున పనిచేస్తున్నాయని, టీఎంసీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. ఎన్నికల పరిశీలకులు కూడా బీజేపీ సూచనల మేరకు వ్యవహరిస్తున్నారని, టీఎంసీ పార్టీ పోస్టర్లు, జెండాలను బలవంతంగా తొలగించారని మండిపడ్డారు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా క్యూలు కనిపిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్