మమత గాయం ఫేక్.. బెంగాల్ సీఎం సంచలన ఆరోపణలు

18చూసినవారు
మమత గాయం ఫేక్.. బెంగాల్ సీఎం సంచలన ఆరోపణలు
2021లో నందిగ్రామ్‌ ఎన్నికల ప్రచారంలో మమతా బెనర్జీకి తగిలిన గాయం నకిలీదని పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి ఆరోపించారు. తన వద్ద ఉన్న వైద్య రిపోర్టుల్లో ‘ఫ్రాక్చర్‌ లేదు’ అని స్పష్టంగా ఉందన్నారు. శుక్రవారం నందిగ్రామ్‌లో బీజేపీ అభ్యర్థి హసిరాణి తరఫున ప్రచారంలో ఈ వ్యాఖ్యలు చేశారు. 2021 మార్చి 10న కారు డోర్‌ తగిలి మమత గాయపడగా, ఆమెను ఎస్‌ఎస్‌కేఎం ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమెకు ఎలాంటి ఫ్రాక్చర్‌ లేదని సువేందు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్