'ఎల్లమ్మ'లో హీరోయిన్‌గా మమితా బైజు?

11చూసినవారు
'ఎల్లమ్మ'లో హీరోయిన్‌గా మమితా బైజు?
సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ 'ఎల్లమ్మ' చిత్రంతో హీరోగా పరిచయం కానున్నారు. 'బలగం' వేణు దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎంపిక ఆలస్యం కావడంతో షూటింగ్ వాయిదా పడింది. కీర్తి సురేష్, మృణాల్ ఠాకూర్ వంటి వారిని సంప్రదించినా ఫలితం లేదని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం, మమితా బైజును హీరోయిన్‌గా ఎంపిక చేసేందుకు మేకర్స్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అన్నీ అనుకూలిస్తే మమితా బైజు దేవిశ్రీ ప్రసాద్‌తో కలిసి నటించే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్