వృద్ధురాలిని బావిలోకి తోసేసిన వ్యక్తి అరెస్ట్(వీడియో)

2చూసినవారు
TG: కరీంనగర్ జిల్లాలో ఈ నెల 1న కూలీ పని ఇప్పిస్తానని తీసుకెళ్లి, ఓ మహిళ వద్ద ఉన్న నగలు, నగదు లాక్కొని ఓ దుండగుడు బావిలో తోసేసిన ఘటన కలకలం రేపింది. ఈ కేసును పోలీసులు ఛేదించారు. జగిత్యాల జిల్లా గుల్లపేట గ్రామానికి చెందిన దమ్మ దినేష్ రెడ్డి(21) అనే యువకుడు ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగులకు బానిసై ఈ దారుణానికి ఒడిగట్టాడు. సదరు వ్యక్తి కరీంనగర్‌లోని ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నట్లు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్, ర్యాపిడో బుక్ చేసిన ఫోన్ నంబర్ ఆధారంగా నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్