గోవుల అక్రమ రవాణాను అడ్డుకున్న వ్యక్తిపై దుండగుల దాడి

0చూసినవారు
హైదరబాద్‌లోని మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంద మల్లమ్మ చౌరస్తా వద్ద గోవుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ప్రేమ్ కుమార్ అనే వ్యక్తిపై ఏడుగురు గుర్తుతెలియని వ్యక్తులు కత్తులు, కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఈ సంఘటనలో ప్రేమ్ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గాయపడిన ప్రేమ్ కుమార్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్