అప్పు ఇచ్చి తిరిగి అడిగినందుకు వ్యక్తి దారుణ హత్య (వీడియో)

19చూసినవారు
AP: చిత్తూరు జిల్లా కుప్పం అమరావతి కాలనీలో అప్పు వివాదం దారుణ హత్యకు దారి తీసింది. బెంగుళూరుకు చెందిన శ్రీనాథ్‌ నుంచి రూ.40 లక్షలు అప్పు తీసుకున్న ప్రభాకర్‌ తిరిగి ఇవ్వకుండా కాలయాపన చేశాడు. అడిగి విసిగిన శ్రీనాథ్‌ వారం క్రితం కుప్పం వచ్చి అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులు బెంగుళూరులో ఫిర్యాదు చేయగా, కర్నాటక–ఏపీ పోలీసుల సంయుక్త విచారణలో ఆయన హత్యకు గురైనట్టు బయటపడింది. కొత్తగా నిర్మించిన ఇంట్లో శ్రీనాథ్‌ మృతదేహాన్ని ప్రభాకర్ పూడ్చిపెట్టినట్టు పోలీసులు గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్