అపార్ట్‌మెంట్‌లో వ్యక్తి దారుణ హత్య

51చూసినవారు
అపార్ట్‌మెంట్‌లో వ్యక్తి దారుణ హత్య
TG: నల్గొండ పట్టణంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో తమిళనాడుకు చెందిన మరియన్ ముత్తు అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. కూలీ డబ్బుల విషయంలో తమిళనాడు కూలీల మధ్య జరిగిన ఘర్షణ ఈ హత్యకు దారితీసిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలు, వేతనాల వివాదం కారణంగా ఈ ఘర్షణ జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. డీఎస్పీ శివరామ రెడ్డి, సీఐ ఆదిరెడ్డి, ఎస్సై సైదాబాబు ఆధ్వర్యంలో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్