బండ్లగూడలో వ్యక్తి దారుణ హత్య

6చూసినవారు
బండ్లగూడలో వ్యక్తి దారుణ హత్య
TG: హైదరాబాద్​లోని నాగోల్ పరిధి బండ్లగూడలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఆ వ్యక్తి వెంటపడిన దుండగులు వేట కొడవళ్లు, కత్తులతో అతడిపై దాడి చేశారు. ప్రాణభయంతో బాధితుడు బండ్లగూడలోని ఓ వైన్స్‌లోకి వెళ్లాడు. అక్కడే ఆ వ్యక్తిని కత్తులతో నరికి చంపారు. కారులో వచ్చిన దుండగులు హత్య చేసిన తర్వాత పరారయ్యారు. మృతుడు ఇల్లెందుకు చెందిన రౌడీషీటర్‌ నయీమ్‌గా పోలీసులు గుర్తించారు. పాతకక్షల నేపథ్యంలో హత్య జరిగినట్లు పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్