హైదరాబాద్ లో వ్యక్తి దారుణ హత్య

93చూసినవారు
హైదరాబాద్ లో వ్యక్తి దారుణ హత్య
TG: హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. పహడీ షరీఫ్ ప్రాంతంలో నమెద్ అమీర్ అనే రౌడీషీటర్ ను గుర్తుతెలియని వ్యక్తులు కిరాతకంగా హత్య చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పాత కక్షలే ఈ హత్యకు కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా పోలీసులు అనుమానిస్తున్నారు.

సంబంధిత పోస్ట్