TG: కామారెడ్డి మున్సిపాలిటీ పరిధి లింగాపూర్ శివారులో ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. బండారి రాజిరెడ్డి(56) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు చంపి బావిలో పడేశారు. రాజిరెడ్డి రెండు రోజుల నుంచి కనిపించకుండా పోయాడు. ఈ క్రమంలో వెతుకుతుండగా శనివారం బావిలో శవమై కనిపించాడు. భూవివాదాలతో ప్రత్యర్థులు కిడ్నాప్ చేసి చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.