రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఎలక్ట్రిక్ ఆటో కొనుగోలు చేసిన ఒక వ్యక్తి తరచూ రిపేర్లు, షోరూమ్ నిర్లక్ష్యంతో విసిగిపోయాడు. దీంతో చెత్త సేవలు అందిస్తున్నారని ఆరోపిస్తూ, షోరూమ్ ముందే తన ఆటోకు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షోరూమ్ తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు.