యూపీలోని బహ్రైచ్ జిల్లా ఫఖర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉమ్రి దెహ గ్రామంలో చిరుత దాడిలో వృద్ధురాలు మరణించింది. ఈ నేపథ్యంలో, అటవీ శాఖ అధికారులు చిరుతను పట్టుకోవడానికి బోను ఏర్పాటు చేశారు. ప్రదీప్ అనే వ్యక్తి మద్యం సేవించి ఇంటికి వెళ్తుండగా, బోనులోని మేకను దొంగిలించాలనే ప్రయత్నంలో లోపలికి వెళ్లి చిక్కుకున్నాడు. గమనించిన గ్రామస్థులు అతన్ని సురక్షితంగా బయటకు తీశారు.