ప్రాణ‌ స్నేహితుడు చ‌నిపోయాడ‌ని వ్యక్తి ఆత్మ‌హ‌త్య‌

38293చూసినవారు
ప్రాణ‌ స్నేహితుడు చ‌నిపోయాడ‌ని వ్యక్తి ఆత్మ‌హ‌త్య‌
TG: కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన హరి భూమయ్య స్నేహితుడు మంగళి నర్సింహులు కృష్ణ మందిర్ వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. బాధతో మద్యం సేవించిన భూమయ్య తన వ్యవసాయ పొలంలోని చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భూమయ్య మృతిపై భార్య హరి గౌరవ్ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.