ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో 40 ఏళ్ల మేస్త్రీ ధరంపాల్ తన భార్య ప్రియుడు భరత్ కుష్వాహా, అతని సోదరుడు శివకుమార్‌ల బెదిరింపులకు భయపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ధరంపాల్ తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భరత్‌ను ఒకరోజు ముందు పట్టుకున్నాడు. అప్పుడు భరత్ అతన్ని చంపేస్తానని బెదిరించి పారిపోయాడు. తన ఆత్మహత్య లేఖలో ధరంపాల్ ఇదే విషయాన్ని పేర్కొన్నాడు.