AP: వడ్డీ వ్యాపారి వేధింపులు తాళలేక రైలు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన వైఎస్సార్ కడప జిల్లా జీజీఎస్ తండాలో చోటు చేసుకుంది. మహేంద్ర నాయక్ (27) అనే వ్యక్తి సుధాకర్ నాయక్ వద్ద అప్పు తీసుకున్నాడు. అయితే అప్పు తీర్చకపోతే చంపేస్తానని సుధాకర్ బెదిరించడంతో మహేంద్ర నాయక్ రైలు కింద పడి మృతి చెందాడు. సుధాకర్ వేధింపుల వల్లే మహేంద్ర నాయక్ చనిపోయాడని అతని భార్య ఆరోపించారు. పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.