భార్య మందలించిందని.. వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి

11469చూసినవారు
భార్య మందలించిందని.. వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి
అప్పులు చేస్తూ, మద్యానికి బానిసైన వ్యక్తిని భార్య మందలించడంతో మనస్తాపానికి గురై మానేరు వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా తంగళ్ళపల్లి మండలంలో చోటుచేసుకుంది. ఇందిరమ్మ కాలనీకి చెందిన ఎల్లా రమేష్ (41) పనిపాటా లేకుండా తిరుగుతూ మద్యానికి బానిసయ్యాడు. తరచూ అప్పులు చేస్తున్న అతడిని భార్య లత మందలించి, ఏదైనా పని చూసుకోమని చెప్పింది. దీంతో మనస్తాపానికి గురైన రమేష్, డిసెంబర్ 3న ఇంట్లో నుంచి బయటకు వెళ్లి శుక్రవారం ఉదయం మానేరు వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

సంబంధిత పోస్ట్