దొంగతనం చేశాడని కర్రలతో దాడి.. వ్యక్తి మృతి

5చూసినవారు
దొంగతనం చేశాడని కర్రలతో దాడి.. వ్యక్తి మృతి
TG: దొంగతనం చేశాడని అనుమానించి ఓ వ్యక్తిపై కర్రలతో దాడి చేయడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. మెదక్​ జిల్లా మన్నేవారి జలాల్‌పూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. గణేశ్​ నిమజ్జనం శోభాయాత్రలో ప్రవీణ్ అనే వ్యక్తి సెల్‌ఫోన్‌ను రామానుజం(38) చోరీ చేశాడని అనుమానం ఉంది. దీంతో అతడిపై ప్రవీణ్ కుటుంబసభ్యులు కర్రలతో దాడి చేశారు. తీవ్రగాయాలు కావడంతో రామానుజం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 8 మంది నిందితులు వెల్దుర్తి PSలో లొంగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్