మామిడి ఆకులు తెంపుతూ రెండంతస్తుల భవనం పైనుంచి పడి వ్యక్తి మృతి

19357చూసినవారు
మామిడి ఆకులు తెంపుతూ రెండంతస్తుల భవనం పైనుంచి పడి వ్యక్తి మృతి
TG: పండుగ పూట హైదరాబాద్‌లోని రామంతపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. దీపావళి సందర్భంగా మామిడి ఆకులు తెంపేందుకు రెండంతస్తుల భవనంపైకి వెళ్ళిన నరసింహా అనే వ్యక్తి, ప్రమాదవశాత్తు కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్