బతుకమ్మ పూల కోసం వెళ్లి సెప్టిక్ ట్యాంక్‎లో పడి వ్యక్తి మృతి

9331చూసినవారు
బతుకమ్మ పూల కోసం వెళ్లి సెప్టిక్ ట్యాంక్‎లో పడి వ్యక్తి మృతి
బతుకమ్మ పండుగ వేళ హైదరాబాద్ నగర శివారు హయత్ నగర్‎లో విషాద ఘటన చోటు చేసుకుంది. సోమవారం బతుకమ్మ పూల కోసం వెళ్లిన యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం షేర్ గూడ గ్రామానికి చెందిన అశోక్ రెడ్డి ప్రమాదవశాత్తూ ఓ వెంచర్‎లో ఉన్న సెప్టిక్ ట్యాంక్ గుంతలో పడి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు వెతుకుతూ వచ్చి చూడగా, మృతదేహం బయటపడింది. పోలీసులు, డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్ సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. పండుగ వేళ జరిగిన ఈ ఘటనతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

సంబంధిత పోస్ట్