TG: హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జన శోభాయాత్రలో విషాదం చోటుచేసుకుంది. ఖైరతాబాద్ సమీపంలో నిమజ్జన వాహనం కిందపడటంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. శోభాయాత్ర సాగుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, మృతుడి వివరాలను సేకరిస్తున్నారు.