దొంగతనానికి వెళ్లి.. కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

3చూసినవారు
దొంగతనానికి వెళ్లి ఓ వ్యక్తి కరెంట్ షాక్‌ తగిలి మృతి చెందిన ఘటన ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లో జరిగింది. మోదీనగర్ పరిధి నివారి ప్రాంతంలోని ఢిల్లీ-మీరట్ రోడ్డు సమీపంలో ఉన్న ఓ ఫామ్‌హౌస్‌లో ఓ దొంగ చోరీ చేయడానికి వెళ్లాడు. కిటికీలో నుంచి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. 11వేల వోల్టుల హైటెన్షన్ వైర్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. కాళ్లు లోపల ఉండగా.. మిగిలిన శరీరం బయటివైపు వేలాడుతూ అతడి మృతదేహం కనిపించింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్