వడదెబ్బ తగిలి పొలంలోనే వ్యక్తి మృతి

47చూసినవారు
వడదెబ్బ తగిలి పొలంలోనే వ్యక్తి  మృతి
భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో వడదెబ్బతో రైతు పెండ్యాల తిరుపతి (34) పొలంలోనే మృతి చెందాడు. బుధవారం పొలానికి వెళ్లిన ఆయన రాత్రి వరకు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. గురువారం ఉదయం తోటి రైతులు మృతదేహాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఎండ తీవ్రత కారణంగానే వడదెబ్బ తగిలి మరణించి ఉంటారని భావిస్తున్నారు.