హైదరాబాద్ శివారు అత్తాపూర్‌లో ఛాతీ నొప్పితో ఆస్పత్రికి వచ్చిన శ్రీనివాస్‌రావు అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందారు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ రోగి బంధువులు ఆస్పత్రిపై దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.