లారీ కింద పడ్డా ప్రాణాలతో తప్పించుకున్నాడు (వీడియో)

1543చూసినవారు
తమిళనాడులోని నీలగిరి జిల్లా కూడలూరు పాత బస్టాండ్ సమీపంలో టిప్పర్ లారీ టైరు కిందపడి ఓ ద్విచక్ర వాహనదారుడు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. రోడ్డు పక్కన ఓ వాహనం ఆగి ఉండగా దాని పక్కన నుంచి వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడిని టిప్పర్ లారీ ఢీకొట్టింది. దాంతో అతడు ఆ లారీ  కిందపడ్డాడు. ఆ సమయంలో వెనుకే వచ్చిన టిప్పర్ లారీ చక్రం అతని తల దగ్గరి నుంచి వెళ్ళింది.