ఆరడుగుల రోబోతో మనిషి ఫైట్‌.. వీడియో వైరల్‌

38చూసినవారు
అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో మనిషి, రోబో మధ్య జరిగిన అరుదైన బాక్సింగ్ పోటీ అందరినీ ఆశ్చర్యపరిచింది. దాదాపు ఆరు అడుగుల ఎత్తైన రోబోతో అమెరికన్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫ్రాంకీ లాపెన్నా తలపడ్డాడు. బాక్సింగ్ రింగ్‌లో లాపెన్నా పంచ్‌లు విసరగా, రోబో కూడా కిక్కులు, పంచ్‌లతో ప్రతిఘటించింది. ఒక దశలో రోబో కిక్‌కు లాపెన్నా కిందపడిపోయాడు. రోబోటిక్స్ సంస్థ ఆర్‌ఈకే నిర్వహించిన ఈ పోటీని మనిషి-రోబో మధ్య జరిగిన తొలి ఫైట్‌గా పేర్కొన్నారు. అయితే, ఈ రోబోను ఒక వ్యక్తి రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేశాడు.

సంబంధిత పోస్ట్