న్యూడ్ ఫోటోలు పంపిస్తామంటూ బెదిరింపులు.. ఉరివేసుకుని వ్యక్తి మృతి

9చూసినవారు
న్యూడ్ ఫోటోలు పంపిస్తామంటూ బెదిరింపులు.. ఉరివేసుకుని వ్యక్తి మృతి
హైదరాబాద్ రాంనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. మూడువేల రూపాయల లోన్ కట్టాలని లేదంటే కుటుంబం మొత్తం నగ్న ఫోటోలు, వీడియోలు పంపిస్తామని బెదిరించడంతో ప్రేమ్‌కుమార్ (36) అనే వ్యక్తి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య నాగవేణి తెలిపిన వివరాల ప్రకారం.. ఫోన్ హ్యాక్ అయి ఉండవచ్చని, లోన్లకు డబ్బులు చెల్లిస్తే ఇబ్బందులు పెరుగుతాయని ఆమె చెప్పినా, ప్రేమ్‌కుమార్ తీవ్ర ఆందోళనకు గురయ్యాడని తెలిపారు. ఈ క్రమంలోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్